Telugu Gateway
Cinema

బాయ్ కాట్ ‘నాని గ్యాంగ్ లీడర్’

బాయ్ కాట్ ‘నాని గ్యాంగ్ లీడర్’
X

హీరో నానిపై మెగా స్టార్ చిరంజీవి ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా దాడి ప్రారంభించారు. నాని కొత్త సినిమా టైటిల్ ను ‘గ్యాంగ్ లీడర్’గా చూపిస్తూ మైత్రీ మూవీ మేకర్స్ తాజాగా ఓ వీడియో విడుదల చేసింది. అదే మెగా అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. ‘పులి ని చూసి ... నక్క వాతలు పెట్టుకుంది అంట....వాతలు పెట్టుకున్నా ... పులి పూలే .. నక్క నక్కే’ అంటూ మెగాస్టార్ ఫాలోయర్స్ పేరుతో నానిని టార్గెట్ చేశారు. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకే ఒక గ్యాంగ్ లీడర్, ఒకే ఇంద్ర ఉంటారు.

అది చిరంజీవే తప్ప...వేరెవరూ కారు అంటూ మరో అభిమాని ట్వీట్ చేశాడు. చిత్ర యూనిట్ తక్షణమే సినిమా టైటిల్ మార్చాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. మరి చిత్ర యూనిట్ మెగా ఫ్యాన్స్ ఆగ్రహాన్ని గమనంలోకి తీసుకుని టైటిల్ మారుస్తుందా?. లేదా వేచిచూడాల్సిందే.

Next Story
Share it