నీ ప్రేమ కూడా పైరసీనే

ప్రేమలో కూడా పైరసీ ఉంటుందా?. అది కల్తీ ప్రేమా?. సినిమాల పైరసీ సబ్జెక్ట్ నే కథాంశంగా చేసుకుని తెరకెక్కుతున్న సినిమానే ‘హీరో..హీరోయిన్. ఈ సినిమాలో నవీన్ చంద్ర హీరోగా నటించారు. ఈ సినిమాకు సంబంధించి టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఇందులో గాయత్రి సురేష్, పూజ జవేరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
స్వాతి పిక్చర్స్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనూప్ రుబెన్స్ సంగీతమందిస్తుండగా జీఎస్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరపుకుంటున్న ఈ సినిమా మార్చిలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాలో నవీన్ చంద్ర సినిమాలను పైరసీ చేసి అమ్మే వ్యక్తిగా కనిపిస్తున్నాడు. అలాంటి క్రిమినల్ ఓ సినీ నిర్మాత కూతురితో ప్రేమలో పడితే ఎలా ఉంటుంది అన్నదే కథ.
https://www.youtube.com/watch?v=Vjwa_FLd-n4