వేం నరేందర్ రెడ్డికి ఈడీ నోటీసులు
BY Telugu Gateway1 Feb 2019 12:13 PM GMT

X
Telugu Gateway1 Feb 2019 12:13 PM GMT
ఓటుకు నోటు కేసులో మళ్లీ కదలిక వచ్చింది. ఈ సారి ఏకంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి కి తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసింది. ప్రధానంగా నామినెటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు ఇచ్చిన 50 లక్షల రూపాయలపై ఈడీ వివరణ కోరింది.
వారం రోజుల్లో విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. గచ్చిబౌలి రోలింగ్‌హిల్స్‌లోని వేం నరేందర్‌రెడ్డి ఇంటికి వెళ్లి ఈడీ అధికారులు నోటీసులు అందజేశారు. ఓటుకు నోటు కేసును ఈ నెలలోనే సుప్రీంకోర్టు ముందుకు కూడా వచ్చే అవకాశం ఉంది. టీడీపీలో ఉండగా నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ బరిలో నిలవగా...ఆయన్ను గెలిపించుకునేందుకు టీడీపీ అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.
Next Story