Telugu Gateway
Offbeat

కప్పు కాఫీ ధర 5600 రూపాయలు

కప్పు కాఫీ ధర 5600 రూపాయలు
X

అవాక్కయ్యారా?. అయినా సరే నిజం ఇదే. ఇదేదో సెవన్ స్టార్ హోటల్ లో తాగినందుకు అయ్యే ఖర్చు కాదు. సహజంగానే ఆ కాఫీ ఖరీదు అంత ఉంటుందట. ఆ వెరైటీ కాఫీ కనిష్ట ధర 2450 రూపాయలు. గరిష్ట ధర మాత్రం 5600 రూపాయలు. అసలు ఏంటీ కాఫీ కథ అంటారా?. సంచలన దర్శకుడు పూరీ జగన్నాధ్ ట్వీట్ తో ఈ విషయం చర్చకు వచ్చింది. ఆయన కొత్తగా ఇఫ్పుడు హీరో రామ్ తో కలసి ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కారణం ఏంటో తెలియదు కానీ..హీరో తన దర్శకుడికి ఈ ఖరీదైన కాఫీ గింజల ప్యాకెట్ ను గిఫ్ట్ గా పంపారు. ఇదే విషయాన్ని పూరీ జగన్నాధ్ ట్విట్టర్ ద్వారా చెబుతూ తనకు హీరో రామ్..ప్రపంచంలోనే ఖరీదైన కాఫీని పంపాడని..దాన్ని తాగుతున్నానని ఫోటోలు పోస్ట్ చేశాడు.

అంతే కాదు.ఈ కాపీ గురించి కావాలంటే గూగుల్ లో వెతకండి అన్ని విషయాలు తెలుస్తాయి అని పేర్కొన్నారు. అంతే కాదు..ఈ కాఫీ పిచ్చెక్కిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ ట్వీట్ పై రామ్ కూడా రియాక్ట్ అయ్యారు. ఈ కాఫీ గురించి గూగుల్ లో వెతక్కండి..దీని గురించి తెలిస్తే దిమాక్ ఖరాబ్ ఐతది అని వ్యాఖ్యానించారు. ఈ కాఫీ గురించి ఆసక్తికర విషయాలు ఏంటి అంటే..ఈ లువాక్ కాఫీని చెర్రీస్ తో తయారు చేస్తారు. ముఖ్యంగా ఈ కాఫీ పంట బాలి, జువా,సుమత్రా సులావెసి ప్రాంతాల్లో పండిస్తారు. ఇండోనేషియాలో కాఫీని కోపి అంటారు.

Next Story
Share it