Top
Telugu Gateway

చంద్రబాబు ‘అప్పడాలు’

చంద్రబాబు ‘అప్పడాలు’
X

దేశంలోని అత్యంత ఎక్కువ ప్రచార ఖండూతి ఉన్న నేతల్లో ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ముందు వరసలో ఉంటారు. ఈ విషయం ఎన్నోసార్లు రుజువు అయింది. కొద్ది రోజుల క్రితమే తిత్లీ తుఫాను బాధితులకు సాయం చేసే డమ్మీ చెక్కులపై కూడా ఏకంగా ‘చంద్రబాబు’ ఫోటోలు ముద్రించి ప్రచారం చేసుకున్నారు. అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్నాం అని చెబుతూ..తుఫాను సాయాన్ని కూడా ప్రచారానికి వాడుకున్నారు. దీని కోసం లక్షలాది డమ్మీ చెక్కులు చంద్రబాబు ఫోటోతో ముద్రించి పంపిణీ చేశారు. దీని కోసం సర్కారు సొమ్మును భారీగా దుర్వినియోగం చేశారు.

ఇది కేవలం ప్రచారం కోసమే. తాజాగా చంద్రబాబే బహిరంగంగా ఆటో కార్మికులతో మాట్లాడుతూ ప్రతి ఆటో వెనక తన ఫోటో వేసి థ్యాంక్యూ సీఎం సర్ అని రాయాలని సూచించారు. ఇప్పుడు ఏకంగా ‘అప్పడాల’పై చంద్రబాబు ఫోటోల ముద్రణ వ్యవహారం కలకలం రేపుతోంది. అది కూడా సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా లోనే జరగటం విశేషం. పసుపు-కుంకుమ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన భోజనాల్లో చంద్రబాబు ఫోటోలు ముద్రించిన అప్పడాలను పెట్టారు. ఈ ఫోటోలు ఇఫ్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

Next Story
Share it