Telugu Gateway
Politics

అప్పుడు ఎన్టీఆర్ పోరాడారు...ఇప్పుడు నేను

అప్పుడు ఎన్టీఆర్ పోరాడారు...ఇప్పుడు నేను
X

‘అప్పుడూ..ఇప్పుడూ మన పోరాటం కేంద్రంపైనే. ఎన్టీఆర్ హయాంలో,ఇప్పుడూ పోరాడుతోంది రాష్ట్రం కోసమే. ఆ రోజు పోరాడి సాధించాం. ఈ రోజు పోరాడి సాధిస్తాం. ఆ రోజు కేంద్రం కుట్రలు తిప్పికొట్టాం. ఈ రోజు కుట్రలు తిప్పికొడతాం. 161మంది ఎమ్మెల్యేలు ఆ రోజు ఎన్టీఆర్ వెంట కట్టుబట్టలతో వచ్చారు. ఎన్టీఆర్ ను మళ్లీ సీఎం చేశాకే పోరాటం విరమించారు. ఆ రోజు దేశం మొత్తం మనతో ఉంది. ఈ రోజు దేశం మొత్తం మనకు అండగా ఉంది. ఆ రోజు ఆత్మగౌరవం కోసమే పోరాడాం. ఈ రోజు ఆత్మగౌరవం కోసమే పోరాడుతున్నాం. తెలుగుజాతికి గుర్తింపు,గౌరవాన్ని తెచ్చింది ఎన్టీఆరే.

తెలుగుదేశం పార్టీ చరిత్రే ‘మహా నాయకుడు’ సినిమా. ప్రతి పేదకుటుంబం మహానాయకుడు సిన్మా చూడాలి. ఎన్టీఆర్ స్ఫూర్తితోనే వినూత్న సంక్షేమ పథకాలు. ఎన్టీఆర్ సంక్షేమాన్ని సంతృప్త స్థాయికి చేర్చాం. మహానాయకుడు సినిమా మంచి స్ఫూర్తి ఇస్తుంది.’ అని టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. 5ఏళ్లు హోదా తొక్కిపట్టి బిజెపి నమ్మకద్రోహం చేసిందని ఆరోపించారు. మార్చి 1న విశాఖపట్నం పర్యటనకు వచ్చే ప్రధాని నరేంద్రమోడీని నిలదీయాలన్నారు.ఎందుకు మా హక్కులు నేరవెర్చరని ప్రశ్నించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Next Story
Share it