వైసీపీలోకి టీడీపీ నేత
BY Telugu Gateway11 Feb 2019 2:03 AM GMT

X
Telugu Gateway11 Feb 2019 2:03 AM GMT
ఎన్నికల వేళ ‘జంపింగ్’ల జోరు పెరిగిపోయింది. రాబోయే రోజుల్లో ఇది మరింత స్పీడ్ అందుకునే అవకాశం ఉంది. టిక్కెట్ అవకాశాలు....భవిష్యత్ పై ఆశలతో ఎవరి అంచనా ప్రకారం వారు పార్టీలు మారుతున్నారు. తాజాగా విశాఖ అర్బన్ టీడీపీ మాజీ ఉపాధ్యక్షుడు, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి శరగడం చినఅప్పలనాయుడు వైసీపీలో చేరారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ కండువా కప్పి చినఅప్పలనాయుడును ఆహ్వానించారు. ప్రత్యేకహోదా, విశాఖ రైల్వేజోన్‌లపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకుంటున్న యూటర్న్ లు నచ్చక, రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన కాంగ్రెస్‌తో జతకట్టడాన్ని జీర్ణించుకోలేక ఆ పార్టీకి శనివారం రాజీనామా చేసినట్లు తెలిపారు.
Next Story