ముగ్గురు ఏపీ ఎమ్మెల్యేల రాజీనామా ఆమోదం
BY Telugu Gateway1 Feb 2019 4:46 AM GMT

X
Telugu Gateway1 Feb 2019 4:46 AM GMT
ఆంధ్రప్రదేశ్ కు చెందిన ముగ్గురు శాసనసభ్యుల రాజీనామాలు ఆమోదం పొందాయి. రకరకాల కారణాలతో ముగ్గురు శాసనసభ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. జనసేనలో చేరిన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు, బిజెపి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తమ ఎమ్మెల్యేల పదవులకు రాజీనామా చేశారు.
తాజాగా టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మేడా మల్లికార్జునరెడ్డి కూడా తన ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖను అందజేశారు. దీంతో స్పీకర్ కోడెల శివప్రసాదరావు ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు.
Next Story