‘అనసూయ’ హ్యాపీ హ్యాపీ
BY Telugu Gateway10 Feb 2019 7:30 PM IST
X
Telugu Gateway10 Feb 2019 7:30 PM IST
పాత్ర చిన్నదే అయినా..పేరు చాలా తెచ్చిపెట్టింది అనసూయకు ఆ సినిమా. అదే దివంగత సీఎం రాజశేఖరరెడ్డి పాదయాత్రకు సంబంధించిన బయోపిక్ సినియా ‘యాత్ర’. సినిమా ప్రారంభంలోనే వచ్చిన ఈ పాత్ర రాయలసీమ యాసతో మాట్లాడుతూ..చక్కటి హావభావాలు చూపించటంలో కూడా అనసూయ సక్సెస్ అయ్యారు. ఈ పాత్రకు మంచి స్పందన వస్తుండటంతో ఆమె ట్విట్టర్ వేదికగా స్పందించారు.
‘సుచరితరెడ్డి పాత్రను పోషించడం నాకు సంతోషంగా ఉంది. నాపై చూపిస్తున్న అభిమానానికి ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఆ పాత్రను నేను పోషించగలనని నాపై నమ్మకం ఉంచిన డైరెక్టర్ మహి వి రాఘవ, 70ఎమ్‌ఎమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు ధన్యవాదాలు’ అంటూ అనసూయ భరద్వాజ్ ట్వీట్ చేశారు. మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన ‘యాత్ర’ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
Next Story