Top
Telugu Gateway

చంద్రబాబుకు షాక్..టీడీపీకి ఆమంచి రాజీనామా

చంద్రబాబుకు షాక్..టీడీపీకి ఆమంచి రాజీనామా
X

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడికి ఎన్నికల ముందు షాక్. స్వయంగా రంగంలోకి దిగి బుజ్జగించిన ఫలితం లేకుండా పోయింది. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పార్టీకి రాజీనామా చేశారు. తన నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని పలు చోట్ల సంబంధం లేని వ్యక్తుల ప్రమేయం ఎక్కువైందని ఆరోపించారు.దీనికి వ్యతిరేకంగానే తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ ‘సంబంధం’ లేని వ్యక్తులు ఎవరు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టీడీపీకి రాజీనామా చేసిన ఆమంచి బుధవారం నాడు హైదరాబాద్ లో లోటస్ పాండ్ లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో భేటీ కానున్నారు. ఆయన పార్టీలో చేరటం లాంఛనమే కానుంది.

వారం రోజుల క్రితమే ఆమంచి హంగామా ప్రారంభం కాగా..వెంటనే జిల్లాకు చెందిన మంత్రి సిద్ధా రాఘవరావుతో రాయభారం పంపారు. ఆ తర్వాత చంద్రబాబుతో కూడా ఆమంచి భేటీ అయ్యారు. అయినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఆమంచి రాజీనామా వార్తలు వచ్చిన వెంటనే టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రంగంలోకి దిగి..జిల్లాకు చెందిన సీనియర్ నేత, ఎమ్మెల్సీ కరణం బలరాంను చీరాల నియోజకవర్గ సమావేవం పెట్టాల్సిందిగా ఆదేశించారు.

.

Next Story
Share it