Telugu Gateway
Cinema

మా ‘కిల్ బిల్ పాండే’ను చూడండి

మా ‘కిల్ బిల్ పాండే’ను చూడండి
X

రేసు గుర్రం సినిమాలో బ్రహ్మానందం, హీరో అల్లు అర్జున్ కాంబినేషన్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. బ్రహ్మానందం పాత్ర ఆ సినిమాలో హైలెట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మధ్యే అస్వస్థతకు గురై హార్ట్ సర్జరీ చేయించుకున్న బ్రహ్మానందాన్ని అల్లు అర్జున్ పరామర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న అల్లు అర్జున్ ‘నిజమైన ఉక్కు మనిషి. ధృడమైన గుండె కలిగిన వ్యక్తి. ఫన్నీ అండ్ ఫియర్ లెస్. మాకిల్ బిల్ పాండేను చూసినందుకు చాలా ఆనందంగా ఉంది’ అంటూ ట్వీట్ చేశారు. ఇటీవలే ముంబైలోని ‘ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్’లో గత నెల 14న ఆయనకు గుండె ఆపరేషన్‌ విజయవంతంగా పూర్తయింది. ఇద్దరూ సరదాగా ఫోటోను ఫోజిచ్చారు.

Next Story
Share it