బడ్జెట్ హైలెట్స్

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పియూష్ గోయల్ శుక్రవారం నాడు పార్లమెంట్ కు తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. పేరుకు ఇది తాత్కాలిక బడ్జెట్ అయినా సరే పూర్తిగా ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగానే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు స్పష్టం అవుతోంది. దేశ రక్షణ రంగానికి బడ్జెట్ లో మూడు లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తూ..అవసరం అయితే మరింత పెంచటానికి కూడా రెడీ అని ప్రకటించారు. పియూష్ గోయల్ బడ్జెట్ స్పీచ్ లోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే....
రికార్డు స్థాయిలో ఎఫ్‌డీఐలు భారత దేశానికి వచ్చాయి.
జీఎస్‌టీ సహా పన్నుల వ్యవస్థల్లో సంస్కరణలు అమలు
సుస్థిర, సమ్మిళిత వృద్ధి కొనసాగింపు లక్ష్యంతో బడ్జెట్‌ను రూపొందించాం
2020కు నవ భారతం నిర్మిస్తాం
దేశం ఆరోగ్యంగా, పరిశుభ్రంగా ఉండాలి
రైతుల ఆదాయం రెండింతలు పెరిగింది.
3 లక్షల కోట్ల డిఫాల్ట్ లోన్లు రికవర్ చేసాం
వృద్ధిరేటులో 11వ స్థానంలో ఉన్న భారత్ 6వ స్థానానికి చేరింది
మా ప్రభుత్వం అవినీతి రహిత ప్రభుత్వం.
రేరా చట్టం ద్వారా బినామీ లావాదేవీలను నిరోధించగలిగాం.
పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లను దేశానికి తిరిగి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నాం.
గ్రామీణ భారతంలో 98శాతం మరుగుదొడ్లు నిర్మించాం.
గ్రామీణ, పట్టణాల మధ్య అంతరాల తొలగింపుకు కృషి చేస్తున్నాం.
గ్రామీణ ప్రాంతాల్లో జీవన ప్రమాణాలను మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
గ్రామీణ సడక్‌యోజనలో భాగంగా మూడింతల రహదారుల నిర్మాణం పెరిగింది.
మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకానికి 60 వేల కోట్లు ఖర్చు చేశాం.
మార్చి వరకు దేశంలో అన్ని ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చాం.
22 రకాల పంటలకు మద్దతు ధర పెంచాం.
ప్రధానమంత్రి సడక్‌యోజనకు.19వేల కోట్లు ఖర్చు చేశాం.
ఇప్పటివరకూ 3వేల కోట్ల పేదల ధనం ఆదా అయింది.
2014కు ముందు బస్సు సౌకర్యం లేని అన్ని గ్రామాలకు ఆ సౌకర్యం కల్పించాం
పేద రైతులకు ఆదాయం పెంపును చర్యలు చేపట్టాం.
చిన్న, సన్నకారు రైతులకు పెట్టుబడి సహాయం కోసం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి
2 హెక్టార్ల వరకు భూమి కలిగిన చిన్న రైతులకు ప్రతియేటా రూ. 6,000
డిసెంబర్ 2018 నుంచే ఈ పథకం అమలవుతుంది
దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది రైతులకు ఈ పథకం ద్వారా నేరుగా లబ్ది
ఈ నిధులను పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది
ప్రధాన్‌మంత్రి కిసాన్ యోజన కింద రైతులకు ఏడాది 6వేలు అందిస్తాం.
2 హెక్టార్ల లోపల(5 ఎకరాలు) వ్యవసాయ భూమి ఉన్న రైతులకు కొత్త పథకంలో లబ్ధి పొందనున్నారు.
మూడు దఫాలుగా ఈ మొత్తం రైతుల ఖాతాల్లో జమ అవుతుంది.
ఐదు ఎకరాల్లోపు ఉన్న రైతులకు ఎకరానికి రూ. 6 వేలు ధనసాయం.
ప్రతి ఏడాదీ పెట్టుబడి సాయం అందిస్తాం.
మూడు ఇన్ స్టాల్ మెంట్ల ద్వారా డబ్బు అందుతుంది.
చిన్న, సన్నకారు రైతుల బ్యాంక్ అకౌంట్లలోకి నేరుగా డబ్బు
గ్యాట్యుటీ పరిమితిని 10 లక్షల నుంచి 30 లక్షల రూపాయలకు పెంచుతున్నాం.
కొత్త పెన్షన్ విధానం సరళీకరిస్తాం!
పెన్షన్‌లో ప్రభుత్వ వాటా 14 శాతానికి పెంపు.
కార్మికులు, కూలీల కోసం ప్రత్యేక పథకాలు.
ఈపీఎఫ్‌వో సభ్యుల సంఖ్య రెండేళ్లలో 2కోట్లు పెరిగింది.
కార్మిక ప్రమాద బీమా మొత్తం.1.50 లక్షల నుంచి .6లక్షలకు పెంపు
ప్రధానమంత్రి శ్రమయోగి బంధన్ పేరుతో అసంఘటిత కార్మికులకు పింఛన్.
60ఏళ్లు నిండిన వారందరికీ ప్రతి నెలా 3వేలు పింఛన్ వచ్చే విధంగా పథకం.
నెలకు 100 చొప్పున ప్రీమియం చెల్లిస్తే 60ఏళ్ల తర్వాత .3వేల పింఛన్.
అసంఘటిత రంగంలోని 10కోట్లమంది కార్మికులకు ఈ పథకం వర్తింపు
గోకుల్ మిషన్ కోసం రూ.750కోట్లు కేటాయిస్తున్నాం.
గో ఉత్పాదకత పెంచడానికి రాష్ట్రీయ కామ్‌ధేన్ ఆయోగ్ ఏర్పాటు