Telugu Gateway
Cinema

కళ్యాణ్ రామ్ కు చుక్కలు చూపించిన బాలయ్య!

కళ్యాణ్ రామ్ కు చుక్కలు చూపించిన బాలయ్య!
X

పాపం నందమూరి కళ్యాణ్ రామ్. తన కొత్త సినిమా 118 ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ఎప్పటిలాగానే బాబాబు బాలకృష్ణ, తమ్ముడు ఎన్టీఆర్ ను పిలిచారు. దీంతో ఈ కార్యక్రమానికి నందమూరి అభిమానులు అందరూ హాజరై ఏదో తన సినిమాకు ప్రచారం కల్పిస్తారని ఆశించారు. కానీ కళ్యాణ్ రామ్ అనుకున్నది ఒకటి...జరిగింది ఒకటి. బాలకృష్ణ ఎంత పనిచేశారంటే కళ్యాణ్ రామ్ సినిమా పేరును ఒకటి కాదు..రెండు మూడు సార్లు తప్పుగా చెప్పి ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు హాజరైన వారందరిని షాక్ కు గురిచేసింది. బాలయ్య చేసిన పొరపాటును కళ్యాణ్ రామ్ ఓ సారి..ఎన్టీఆర్ ఓ సారి సరిచేసినా సరే బాలయ్య మాత్రం తన మాట నుంచి వెనక్కి మళ్ళలేదు.

తాను చెప్పిన తప్పునే పదే పదే చెప్పి వెళ్ళిపోయారు. దీంతో అవాక్కవటం అభిమానుల వంతు అయింది. 118గా ఉన్న సినిమా పేరును బాలయ్య 189గా చెబుతూ ఉంటే.. వేదికపై ఉన్నవారు ఆశ్యర్యపోయారు. ఫైనల్ గా కూడా బాలయ్య సినిమాను 189 అంటూనే ముగించారు. కెవీ గుహన్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీని ఈస్ట్‌ కోస్ట్‌ సంస్థ నిర్మించింది. ఈ చిత్రంలో నివేదా థామస్‌, షాలినీ పాండేలు హీరోయిన్లుగా నటించారు. మార్చి 1న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Next Story
Share it