విశ్వామిత్ర ట్రైలర్ వచ్చేసింది
BY Telugu Gateway25 Feb 2019 1:51 PM IST
X
Telugu Gateway25 Feb 2019 1:51 PM IST
విభిన్న పాత్రలు పోషిస్తూ ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో తనకంటూ ఓ చోటు ఏర్పాటు చేసుకునే పనిలో పడ్డారు ప్రసన్న. ఆయన హీరో గా నటించిన సినిమానే ‘విశ్వామిత్ర’. ఇందులో ప్రసన్న పోలీసు ఆఫీసర్ గా నటిస్తున్నారు. నందిత ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు.
ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ సోమవారం నాడు విడుదల చేసింది. ట్రైలర్ లో సన్నివేశాలు..సంభాషణలు ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. నిజ జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కించినట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమా మార్చి 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
https://www.youtube.com/watch?v=O09oFtdivZU
Next Story