‘కల్కి’’ మోస్టర్ పోస్టర్
సుదీర్ఘ విరామం తర్వాత రాజశేఖర్ హీరోగా సినిమా వస్తోంది. అదే కల్కి. గరుడవేగ సినిమాతో చాలా కాలం తర్వాత మంచి హిట్ అందుకున్న రాజశేఖర్ చేస్తున్న సినిమా ఇదే. ‘అ!’ సినిమాతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. నూతన సంవత్సరం సందర్భంగా విడుదల చేసిన మోషన్ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అందులో రాజశేఖర్ ఎంతో స్టైలిష్ గా కన్పించారు.
1983 నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. శ్రవణ్ భరద్వాజ్ సంగీతాన్ని అందించగా.. ఆదా శర్మా, నందితా శ్వేత హీరోయిన్లుగా నటిస్తున్నారు. శివానీ శివాత్మిక మూవీస్ బ్యానర్ సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై రూపొందనున్న ఈ సినిమాకి సి.కల్యాణ్, శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ నిర్మాతలు.
https://www.youtube.com/watch?v=h8hLDfEa99E