జగన్ పాదయాత్ర@3600 కిలోమీటర్లు
BY Telugu Gateway5 Jan 2019 12:09 PM GMT
X
Telugu Gateway5 Jan 2019 12:09 PM GMT
ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర తుది దశకు చేరుకుంది. అదే సమయంలో మరో కీలక ఘట్టాన్ని పూర్తి చేసుకుంది. జగన్ పాదయాత్ర శనివారం నాటికి అత్యంత కీలకమైన 3600 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని బారువ జంక్షన్ వద్ద వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర 3600 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించింది.
ఈ సందర్భంగా జగన్ ఈ మైలురాయికి గుర్తుగా వేప మొక్కను నాటి, పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున ప్రజలు, కార్యకర్తలు, పాల్గొన్నారు. శనివారం ఉదయం వైఎస్ జగన్ సోంపేట మండలంలోని తురకశాసనం నుంచి 337వరోజు పాదయాత్రను ప్రారంభించారు. జగన్ పాదయాత్ర.. 9న ఇచ్ఛాపురంలో భారీ బహిరంగ సభతో ముగియనుంది.
Next Story