Telugu Gateway
Cinema

‘వినయ విధేయ రామ’ మూవీ రివ్యూ

‘వినయ విధేయ రామ’ మూవీ రివ్యూ
X

రామ్ చరణ్, కైరా అద్వానీ. ఇద్దరూ సక్సెస్ బాటలో ఉన్నవారే. రామ్ చరణ్ తాజా సినిమా రంగస్థలం బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టింది. టాలీవుడ్ లో కైరా అద్వానీ తొలిసినిమా భరత్ అనే నేను సూపర్ హిట్ టాక్ అందుకుంది. మరి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే సహజంగా ప్రేక్షకుల్లో అంచనాలు సహజం. అందులో దర్శకుడు బోయపాటి శ్రీను అంటే అందులో కావాల్సినన్ని మసాలాలు ఉంటాయి. భారీ చిత్రాల నిర్మాత డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించిన ‘వినయ విధేయ రామ’ సంక్రాంతి సందర్భంగా శుక్రవారం నాడే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సినిమా కథ ఏంటి అంటే...ఓ నలుగురు అనాథ పిల్లలు చిత్తు కాగితాలు ఏరుకుని బతుకుతుంటారు. ఓ సారి పిల్లలను కిడ్నాప్ చేసే గ్యాంగ్ ఎత్తుకెళుతుంటే ఈ అనాథ పిల్లలు చూస్తారు. వీళ్లకు విషయం తెలిసిందని వాళ్ళను కూడా చంపేయని ఆదేశిస్తాడు గ్యాంగ్ లీడర్. ఎలాగో తప్పించుకుని వాళ్ళకు వాళ్లే చనిపోదామని రైల్వే ట్రాక్ పై కూర్చున్న నలుగురు పిల్లలకు...ఒక్కసారిగా చిన్నపిల్లాడి ఏడుపు విన్పిస్తుంది. దీంతో పక్కకు వచ్చి..ముళ్ళ కంపల్లో ఉన్న పిల్లాడిని బయటికి తీసి ఆస్పత్రికి తీసుకెళ్లి కాపాడతారు. అప్పటి నుంచి ఆ నలుగురు తమకు దొరికిన పిల్లాడిని చదివించటానికి కష్టపడాలని నిర్ణయించుకుంటారు. కానీ దొరికిన పిల్లాడే తనను కాపాడిన ఆ నలుగురి బాధ్యతలు తీసుకుని వాళ్ళను ముందుకు నడిపిస్తాడు. ఇదే సినిమా కథ.

రామగా నటించిన హీరో రామ్ చరణ్ ఈ సినిమా కోసం కష్టపడి మంచి ‘ఫిజిక్’ సాధించినా కథలో దమ్ములేకపోవటంతో నిరాశే మిగిల్చిందని చెప్పొచ్చు. పాటల్లోనూ..ఫైట్లలోనూ రామ్ చరణ్ తన పాత్రకు న్యాయం చేశాడు. రామ్ చరణ్, కైరా అద్వానీ కాంబినేషన్ ఏ మాత్రం ఆకట్టుకునేలా లేదు. ఎలాంటి లవ్ ట్రాక్ లేకుండా...నేరుగా హీరోయిన్ ఇంటికెళ్లి పెళ్లి చూపులు చూడటంతో వీరిద్దరి కాంబినేషన్ ముందుకు సాగుతుంది. విలన్ గా నటించిన వివేక్ ఒబెరాయ్ తన పాత్రకు న్యాయం చేశాడనే చెప్పొచ్చు. ఫ్యామిలీ ట్రాక్ కూడా సాదాసీదాగానే ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే పాత బాలకృష్ణ సినిమాలో రామ్ చరణ్ నటించినట్లు ఉంది. ఓవరాల్ గా చూస్తే ‘వినయ విధేమ రామ’ ఫక్తు ఊర మాస్...రొటీన్ ఫార్ములా సినిమా.

రేటింగ్. 2/5

Next Story
Share it