చంద్రబాబు కూడా యాగాలను నమ్ముకున్నారా?.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్ హాట్ గా ఉన్నాయి. ఎలాగైనా ఈ సారి అధికారంలోకి రావాలని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. తిరిగి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భూమ్యాకాశాలను ఏకం చేస్తున్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలతో విజయం దక్కించుకున్న తెలంగాణ సీఎం కెసీఆర్ ఎన్నికల ముందు పలు యాగాలు..పూజలు చేశారు. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఇదే బాటలో నడుస్తున్నట్లు కన్పిస్తోంది. అయితే ఆయన నేరుగా యాగంలో పాల్గొనకుండా ఆయన తరపున పూజారులే యాగం నిర్వహించి..చంద్రబాబునాయుడిని ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వాట్సప్ లో హల్ చల్ చేస్తోంది. అందులో జ్యోతిష్య ప్రముఖుడు వేణుస్వామి ఉన్నారు. ఆయన చంద్రబాబుకు తిరుమల వెంకటేశ్వరస్వామి ఫోటోను బహుకరించి...ముఖ్యమంత్రి పదవి పున:ప్రాప్తిరస్తు అంటూ ధీవించారు.
మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని చెబుతారు. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత బాలకృష్ణ ఆదేశాల మేరకు మేడమ్ తో మాట్లాడి రాజశ్యామల యాగం చేశామని..ఇప్పుడు దీవించటానికి వచ్చామని చెబుతారు. అంతే కాకుండా..ఈ సమయంలో..ఈ వయస్సులో మీరు పడుతున్న కష్టం గ్రేట్ సార్. మీ నుంచి మేం స్పూర్తి పొందాల్సి ఉంటుంది అంటూ వేణుస్వామి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఏపీలో తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా ఎదురుగాలులు వీస్తున్నాయి. వీటి నుంచి ఎలా బయటపడాలా? అన్న అంశంపై చంద్రబాబు అండ్ టీమ్ తర్జనభర్జనలు పడుతోంది. అందులో భాగంగానే చంద్రబాబు కూడా యాగాలు..పూజలను నమ్ముకున్నట్లు కన్పిస్తోంది.
https://www.facebook.com/telugu.gateway.5/videos/2236796519980189/