‘వాల్మీకి’గా వరుణ్ తేజ్
BY Telugu Gateway27 Jan 2019 12:39 PM IST

X
Telugu Gateway27 Jan 2019 12:39 PM IST
వరుణ్ తేజ్. ఈ మధ్య పట్టిందల్లా బంగారమే అవుతోంది. వరస హిట్లు అందుకుంటున్న ఈ హీరో కొత్త ప్రాజెక్టుకు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ ను చిత్ర యూనిట్ ఆదివారం నాడు విడుదల చేసింది. అదే ‘వాల్మీకి’. తాజాగా వరుణ్ తేజ్ నటించిన అంతరిక్షం సినిమా మంచి ఆదరణ పొందగా..ఎఫ్2 మాత్రం దుమ్మురేపుతోంది. అదే జోష్ లో వరుణ్ తేజ్ ముందుకు పోతున్నాడు.
హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తమిళంలో సూపర్ హిట్ అయిన జిగర్తాండ సినిమానే తెలుగులో వాల్మీకిగా తెరకెక్కించనున్నారు. ఈ సినిమాను రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
Next Story



