టీఆర్ఎస్ లోకి ఒంటేరు ప్రతాప్ రెడ్డి

రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు అనటానికి ఇదే ఓ ఉహదారణ. గత ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కెసీఆర్ పై గజ్వేల్ లో పోటీచేసిన కాంగ్రెస్ అభ్యర్ధి ఒంటేరు ప్రతాప్ రెడ్డి కారెక్కటానికి రెడీ అయిపోయారు. ఎన్నికల సమయంలో ఒంటేరు ప్రతాప్ రెడ్డి తన ప్రత్యర్ధి అయిన కెసీఆర్ పై చేసిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు అవన్నీ మర్చిపోయి ఆయన కెసీఆర్ వైపు మారటానికి రెడీ అయిపోయారు. శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా
కప్పుకోనున్నట్లు సమాచారం.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, 2018లో కాంగ్రెస్ పార్టీ తరఫున గజ్వేల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రతాప్ రెడ్డి బరిలోకి దిగిన సంగతి
తెలిసిందే. ఈ క్రమంలో తన ప్రత్యర్థి కేసీఆర్ చేతిలో రెండు పర్యాయాలు ఆయన ఓటమి పాలయ్యారు. నియోజకవర్గానికి ఏ మాత్రం రాని కెసీఆర్ పై చాలా వ్యతిరేకత ఉందని ఈ సారి తన గెలుపును ఎవరూ ఆపలేరని ఒంటేరు ప్రతాప్ రెడ్డి పలు మార్లు ప్రకటించారు. అయినా కెసీఆర్ భారీ మెజారిటీతో నెగ్గారు.