టీడీపీలోకే వంగవీటి రాధా
BY Telugu Gateway22 Jan 2019 8:24 AM GMT

X
Telugu Gateway22 Jan 2019 8:24 AM GMT
వైసీపీకి రాజీనామా చేసిన వంగవీటి రాధా చేరేది అధికార తెలుగుదేశం పార్టీనే అని తేలిపోయింది. టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రాబాబునాయుడు కృష్ణా జిల్లా నేతలతో సమావేశం అయి వంగవీటి రాధా చేరిక అంశాన్ని ప్రస్తావించారు. తామంతా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని..రాధా చేరిక పై తమకెలాంటి అభ్యంతరాలులేవని తెలపటంతో రాధా చేరికకు మార్గం సుగమం అయింది. అయితే టీడీపీలో చేరే వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ పదవి ఇఛ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
తాజాగా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కించుకున్న దేవినేని అవినాష్ కూడా రాధా చేరికపై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని పార్టీ నేతలు తెలిపారు. అయితే వంగవీటి రంగా హత్య వెనక టీడీపీ ఉందనే ప్రచారం రాజకీయవర్గాల్లో బలంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు ఆయన తనయుడు వంగవీటి రాధా ఏకంగా టీడీపీలో చేరనుండటం విశేషం.
Next Story