Telugu Gateway
Andhra Pradesh

బాబూ...తలసాని వియ్యంకుడికి టీటీడీ ఛైర్మన్ ఇచ్చిందెవరు?

బాబూ...తలసాని వియ్యంకుడికి  టీటీడీ ఛైర్మన్ ఇచ్చిందెవరు?
X

‘బంధుత్వాలు ఉంటే ఇంట్లో పెట్టుకోవాలి. స్నేహాలు ఉంటే వ్యక్తిగతంగా చేసుకోవాలి.’ ఇవీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి వ్యాఖ్యలు. తెలంగాణ ప్రాంతానికి చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్ ఏపీ పర్యటన సందర్భంగా టీడీపీ నేతలు పాల్గొనటంపై చంద్రబాబు గురువారం నాడు చంద్రబాబు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. భవిష్యత్ లో ఇలాంటివి పునరావృతం అయితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అకస్మాత్తుగా చంద్రబాబుకు తెలంగాణ నేతలతో బంధుత్వాలు అంశాలు ఇప్పుడే ఎందుకు తెరపైకి వచ్చాయి. మరి ఇదే శ్రీనివాసయాదవ్ వియ్యంకుడు సుధాకర్ యాదవ్ కు ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అత్యంత కీలకమైన టీటీడీ ఛైర్మన్ పదవి ఎలా ఇచ్చారు?. సుధాకర్ యాదవ్ పై ఎన్ని విమర్శలు వచ్చినా కూడా లెక్క చేయకుండా..టీటీడీ ప్రతిష్టను కూడా ఏ మాత్రం లెక్కచేయకుండా తాను అనుకున్న విధంగానే సుధాకర్ యాదవ్ కు పదవి కట్టబెట్టారే?.

ఒక్క ఈ పదవే ఏంటి?. ఇదే సుధాకర్ యాదవ్ కంపెనీకి ఏపీలో నామినేషన్ పై కోట్లాది రూపాయలు పనులు అప్పగించలేదా?. టీటీడీ ఛైర్మన్ పదవి ఇచ్చినప్పుడు..కోట్లాది రూపాయల పనులు ఇఛ్చినప్పుడు చంద్రబాబుకు గుర్తుకు రాని బంధుత్వాల అంశాలు ఇప్పుడెందుకు వస్తున్నాయి?. ఓ వైపు నిత్యం బిజెపిని విమర్శిస్తూ ఆ పార్టీకి చెందిన వారిని అత్యంత కీలకమైన టీటీడీ బోర్డులో కొనసాగిస్తారు. తాను మాత్రం తన రాజకీయ అవసరాల కోసం ఎవరినైనా..ఎక్కడైనా..ఎప్పుడైనా కలుస్తారు. కానీ ఇతర నాయకులు మాత్రం బంధుత్వాలు..స్నేహాలు చేస్తే చంద్రబాబు ఊరుకోరట.

Next Story
Share it