Telugu Gateway
Cinema

కంగనకు తమన్నా మద్దతు

కంగనకు తమన్నా మద్దతు
X

కంగనా రనౌత్. నిత్యం ఏదో ఒక వివాదంలో నానుతూనే ఉంటుంది. తాజాగా ఆమె నటించి..కొంత మేర దర్శకత్వం వహించిన సినిమా ‘మణికర్ణిక’. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. చాలా మంది ప్రముఖులు సైతం ఈ సినిమాలో కంగన నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ సినిమాకు దర్శకత్వం వహించిన క్రిష్ ఇటీవల జాతీయ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. వీటిపై ఇంత వరకు కంగన స్పందించలేదు కానీ..ఆమె సోదరి మాత్రం స్పందించారు.

మీరు చెప్పిందే నిజం అనుకుందాం..కానీ కంగనను ఆ విజయాన్ని ఆస్వాదించనివ్వండి క్రిష్ అంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు కంగన సోదరి. తాజాగా తమన్నా కూడా ఈ వివాదం కాకపోయినా కంగనకు మద్దతుగా నిలిచారు. నటన విషయంలో ఆమెను ఎవరూ ఏమీచేయలేరన్నారు. అదే సమయంలో దర్శకుడు క్రిష్ గురించి కూడ తనకు తెలుసన్నారు. అయితే ఈ వివాదం ఓ దురదృష్టకరం అని వ్యాఖ్యానించారు. తమన్నా తెలుగులో తాజాగా నటించిన ఎఫ్2 సినిమా వంద కోట్లకు పైగా వసూళ్ళు సాధించి దుమ్మురేపుతున్న విషయం తెలిసిందే.

Next Story
Share it