Telugu Gateway
Cinema

సూర్య‌కాంతం టీజ‌ర్ వ‌చ్చేసింది

సూర్య‌కాంతం టీజ‌ర్ వ‌చ్చేసింది
X

ఎన్నో ఒత్తిళ్లు అదిగ‌మించి హీరోయిన్ గా అడుగుపెట్టింది నిహారిక కొణిదెల‌. వెబ్ సిరీస్ లో స‌క్సెస్ లు అందుకున్న ఈ హీరోయిన్ వెండితెరపై అప్పుడ‌ప్పుడు అలా మెరుస్తున్నా విజ‌యం మాత్రం ఆమె వైపు చూడ‌టం లేదు. అయినా స‌రే త‌న ప్ర‌య‌త్నాలు తాను చేస్తూనే ఉంది. ఇప్పుడు కొత్త‌గా సూర్య‌కాంతం సినిమాతో మ‌రోసారి త‌న ల‌క్ ను చెక్ చేసుకోవ‌టానికి రెడీ అయింది. డైరెక్టర్‌ ప్రణీత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సూర్య‌కాంతం సినిమాను సందీప్ ఎర్రం రెడ్డి నిర్మిస్తున్నారు.

మూవీ ప్రమోషన్లలో భాగంగా మెగా హీరో, నిహారిక సోదరుడు వరుణ్‌ తేజ్‌ సూర్యకాంతం టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈ టీజ‌ర్ ఆక‌ట్టుకునేలా ఉంద‌ని చెప్పొచ్చు. తినడానికి పుణుగుల్లేవు గానీ బెగ్గర్‌కి బర్గర్‌కి తినిపిస్తా అన్నాడట’ అంటూ నిహారిక బబ్లీగా చెప్పిన డైలాగ్స్‌ ఆకట్టుకుంటున్నాయి. ఇక చివర్లో .. ‘ పెళ్లి ఒప్పుకోకపోతే చెయ్యి కోసుకుంటా’ అంటూ సుహాసిని బెదిరించడం.. ఆ వెంటనే నిహారిక ఐదంకెలు లెక్కబెట్టి కోసుకో అని చెప్పిన డైలాగ్స్‌తో టీజ‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది.

https://www.youtube.com/watch?v=UZq_r5DUy9I

Next Story
Share it