అన్నాడీఎంకె ఎంపీలపై వేటు
BY Telugu Gateway2 Jan 2019 7:28 PM IST
X
Telugu Gateway2 Jan 2019 7:28 PM IST
పార్లమెంట్ లో ఎంపీలపై సస్పెన్షన్ వేటు చాలా అరుదుగా ఉంటుంది. స్పీకర్ సుమిత్రా మహాజన్ బుధవారం నాడు అన్నాడీఎంకె ఎంపీలపై ఐదు రోజుల పాటు సస్పెన్షన్ వేటు వేశారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తున్నారని ఈ చర్య తీసుకున్నారు. ఆ పార్టీకి చెందిన 26 మంది ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేశారు. కావేరీ నదిపై కర్ణాటకలో మేకదాటు ఆనకట్టనునిర్మించాలని ప్రతిపాదించడంపై అన్నా డీఎంకే ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
లోక్‌సభ వెల్‌లోకి ప్రవేశించి, నినాదాలు చేశారు. తమను సస్పెండ్ చేయడంపై ఆ పార్టీ నేత తంబిదురై మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్నాయని, కర్ణాటకలో కొన్ని సీట్లు గెలవాలని బీజేపీ కోరుకుంటోందని, అందుకే మేకదాటు ఆనకట్ట నిర్మాణానికి అనుమతించారని ఆరోపించారు. నిరసన తెలియజేయడం తమకుగల ప్రజాస్వామిక హక్కు అని తెలిపారు.
Next Story