మంత్రి సోమిరెడ్డికి ఝలక్
BY Telugu Gateway23 Jan 2019 8:46 AM GMT

X
Telugu Gateway23 Jan 2019 8:46 AM GMT
నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత,మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఇది ఊహించని ఝలక్. ఏకంగా ఆయన సొంత బావ బుధవారం నాడు హైదరాబాద్ లో వైసీపీ అధినేత జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. నిత్యం వైసీపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తే సోమిరెడ్డికి ఇది మింగుడుపడని వ్యవహారమే. సోమిరెడ్డి బావ సుబ్బారెడ్డితో పాటు ఆయన కుమారులు శశిధర్‌రెడ్డి, కళాధర్‌రెడ్డి కూడా పార్టీలో చేరారు.
రామకోట సుబ్బారెడ్డి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోదరి భర్త. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, కావలి ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్‌రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ వ్యవహారంపై సోమిరెడ్డి ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.
Next Story