శర్వానంద్ కు జోడీ సమంత
BY Telugu Gateway26 Jan 2019 2:48 PM IST
X
Telugu Gateway26 Jan 2019 2:48 PM IST
సరికొత్త కాంబినేషన్. శర్వానంద్ కు జోడీగా సమంత నటించనున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన సినిమా 96 ను రీమేక్ చేయనున్నారు. తమిళ సినిమాలో విజయ్ సేతుపతి, త్రిష నటించారు. ఎప్పటి నుంచో ఈ సినిమా గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నా ఇప్పుడు మాత్రం చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
తమిళంలో సినిమాను తెరకెక్కించిన దర్శకుడు ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించనున్నారు. మార్చిలోనే ఈ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. తమిళ సినిమా హక్కులను ఆయన ఎప్పుడో కొనుగోలు చేసి..ఇప్పుడు సినిమాకు శ్రీకారం చుట్టారు
Next Story