Telugu Gateway
Cinema

దుమ్మురేపుతున్న సాయిపల్లవి

దుమ్మురేపుతున్న సాయిపల్లవి
X

సాయిపల్లవి దుమ్మురేపుతున్నారు. ఓ పాటలో ఆమె ఇరగదీసిన డ్యాన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అంతే కాదు..యూట్యూబ్ లో ఇప్పుడు ఈ పాట రికార్డులు బద్దలు కొడుతోంది. కేవలం ఒక్క రోజుల్లోనే ఈ పాటను కోటి మందికిపైగా వీక్షించారు. ఈ పాటలో సాయిపల్లవి డ్యాన్స్ తో పాటు ఆమె హావభావాలు కూడా ప్రేక్షకుల మనసు దోచుకున్నాయి. గత నెలలో విడుదలైన ‘మారి2’ సినిమాలో ధనుష్ తో కలసి సాయిపల్లవి డ్యాన్స్ అదరగొట్టారు.

ఈ సినిమా కూడా వసూళ్ళ పరంగా దూకుడుతో ముందుకు వెళుతోంది. చిత్ర యూనిట్ తాజాగా ‘రౌడీ బేబీ’ పాటను యూట్యూబ్ లో విడుదల చేయగా..అది ఎన్నో కొత్త ‘రికార్డులు’ నమోదు చేస్తూ దూసుకెళుతోంది. ప్రేమమ్ సినిమాలోనూ సాయిపల్లవి డ్యాన్స్ యూత్ ను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అంతకు మంచి ఈ కొత్త పాట దుమ్మురేపుతోంది. తెలుగులోనూ సాయిపల్లవి ఎంపిక చేసిన సినిమాలు చేస్తూ దూసుకెళుతోంది.

https://www.youtube.com/watch?v=x6Q7c9RyMzk

Next Story
Share it