Telugu Gateway
Cinema

పెళ్లి పీటలెక్కనున్న రిచా గంగోపాధ్యాయ

పెళ్లి పీటలెక్కనున్న రిచా గంగోపాధ్యాయ
X

మిర్చి..మిరపకాయ వంటి సినిమాల్లో మెరుపులు మెరిపించిన రిచా గంగోపాద్యాయ పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఆమె ఎంగేజ్ మెంట్ పూర్తయింది. పెళ్లి ఎప్పుడు అనేదానిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ విషయాన్ని రిచానే స్వయంగా ట్విట్టర్ వేదిక ద్వారా వెల్లడించారు. తెలుగులో ఈ భామ చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. రానా హీరోగా నటించిన ‘లీడర్’ సినిమాతో టాలీవుడ్ కు రిచా పరిచయం అయ్యారు.

సడన్ గా సినిమాలకు బ్రేక్ ఇచ్చి విదేశాలకు వెళ్ళిపోయిన రిచా ఇప్పుడు ఏకంగా పెళ్లి వార్తతో అందరినీ ఆశ్చర్యపరిచింది. తనకు బిజినెస్‌ స్కూల్‌లో పరిచయం అయిన జోయ్ అనే వ్యక్తితో తన నిశ్చితార్థం జరిగినట్టుగా రిచా ప్రకటించారు. జీవితంలో కొత్త మార్పుకోసం ఆనందంగా ఎదురుచూస్తున్నట్టుగా రిచా తెలిపారు. సో రిచా గంగోపాద్యాయ అభిమానులకు ఆమెను కొత్త సినిమాల్లో చూసే ఛాన్స్ లేనట్లే.

Next Story
Share it