నాగబాబు..బాలయ్య వివాదంలోదూరిన వర్మ
వివాదాలు ఎక్కడ ఉంటే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అక్కడ ఉంటారు. గత కొంత కాలంగా మౌనంగా ఉంటూ వచ్చిన ఆయన తాజాగా నాగబాబు-బాలయ్య ఫ్యాన్స్ వివాదంలో దూరారు. ఈ అంశంపై ఆయన ట్విట్టర్ లో వెటకారంగా స్పందించారు. దీంతో ఈ వివాదం మరెన్నో మలుపులు తిరుగుతుందో అన్న ఆసక్తి నెలకొంది. బాలక్రిష్ణ మాత్రం నాగబాబు వ్యాఖ్యలపై స్పందించేందుకు నిరాకరించారు. వర్మ మాత్రం దీనిపై స్పందించారు. అదేంటో మీరూ చూడండి.
‘కామెంట్లలో నన్ను మించిపోయారనే నా బాధ ఒక వైపు.. తన స్టార్ బ్రదర్స్‌ని సమర్థించుకోవడంలో సూపర్ స్టార్ అయ్యారని ఒకవైపు.. ఒక కంట కన్నీరు.. మరో కంట పన్నీరు.. నాగబాబు గారు హ్యాట్సాఫ్.. మీరు మీ బ్రదర్స్‌ను ఎంతగా ప్రేమిస్తున్నారో.. నేనూ అంతే ప్రేమిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశాడు. గతకొన్ని రోజులుగా మెగా బ్రదర్ నాగబాబు చేస్తున్న కామెంట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే.