Telugu Gateway
Cinema

‘వివాదస్పదం’ అయిన రకుల్ ఫోటో

‘వివాదస్పదం’ అయిన రకుల్ ఫోటో
X

టాలీవుడ్ లో ఒకప్పుడు గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఈ మధ్య కాలంలో ఆమె స్పీడ్ అంత లేదనే చెప్పొచ్చు. రకుల్ ప్రస్తుతం తెలుగులో కంటే తమిళంలో ఎక్కువ సినిమాలు చేస్తున్నట్లు కన్పిస్తోంది. ఈ మధ్యే ఎన్టీఆర్ బయోపిక్ మహానాయకుడులో ఓ పాటలో సందడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం రకుల్ ఫోటో ఒకటి పెద్ద దుమారం రేపుతోంది. ఆ ఫోటోను ఉద్దేశించి ఓ వ్యక్తి ట్విట్టర్ లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనికి రకుల్ ప్రీత్ సింగ్ కూడా అంతే ఘాటుగా సమాధానం చెప్పింది. కార్ నుంచి దిగుతున్న త‌న ఫోటోను ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌ కు ఓ నెటిజ‌న్ అశ్లీల కామెంట్ పెట్టాడు. 'కార్‌లో ఏదో సెష‌న్‌లో పాల్గొన్న ర‌కుల్ ప్యాంట్ వేసుకోవ‌డం మ‌ర్చిపోయింది' అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు.

ఈ కామెంట్ ర‌కుల్ దృష్టికి వెళ్ల‌డంతో ఆమె కూడా తీవ్రపదజాలంతో విరుచుకుపడింది. ‘నాకు తెలిసి మీ అమ్మ కూడా కార్లో చాలా సెష‌న్స్‌ లో పాల్గొని ఉంటుంది. అందుకే నీకు ఈ విష‌యాలు బాగా తెలిశాయి. ఈ సెష‌న్‌ల గురించి కాకుండా కొంచెం సంస్కారానికి సంబంధించిన విష‌యాలు కూడా నేర్ప‌మ‌ని మీ అమ్మని అడుగు. ఇలాంటి మ‌నుషులు ఉన్నంత వ‌ర‌కు మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ ఉండ‌దు. ర‌క్ష‌ణ‌, స‌మాన‌త్వం అంటూ చర్చ‌లు సాగించ‌డం వ‌ల్ల ఉప‌యోగం ఉండ‌ద‌'ని ర‌కుల్ ట్వీట్ చేసింది. అయితే రకుల్ వ్యాఖ్యలపై మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. తిట్టిన వ్యక్తిని కాకుండా అతడి తల్లిని వివాదంలో లాగటం ద్వారా రకుల్ కూడా మరో స్త్రీనే అవమానించిందని కొంత మంది నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

Next Story
Share it