Telugu Gateway
Cinema

‘హృదయాల’ను తాకుతున్న యాత్ర పాట

‘హృదయాల’ను తాకుతున్న యాత్ర పాట
X

ప్రముఖ గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ‘పల్లెల్లో కల ఉంది...పంటల్లో కలిముంది’ అంటూ సాగే పాట హృదయాలను తాకుతోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి బయోపిక్ గా తెరకెక్కుతున్న యాత్ర సినిమాలోదీ ఈ పాట. రైతుల కన్నీటిగాథలను ఈ ఒక్క పాటతోనే అద్భుతంగా ఆవిష్కరించారు రచయిత. చిత్ర యూనిట్ తాజాగా ఈ పాటను విడుదల చేసింది. ఇందులో వైఎస్ పాత్ర పోషించిన మమ్ముట్టి స్టిల్స్ ను కూడా జోడించారు. ఈ సినిమాకు ఈ పాట పెద్ద బలంగా మారుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు.

సిరివెన్నెల సాహిత్యం అందించగా..ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు. ఈ చిత్రానికి కె (కృష్ణ కుమార్‌) సంగీతాన్ని అందించారు. ఆనందో బ్రహ్మ ఫేమ్‌ మహి వి రాఘవ యాత్ర సినిమాకు దర్శకత్వం వహించారు. శివ మేక సమర్పణలో 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 8న మూడు (తెలుగు, తమిళ, మలయాళ) భాషల్లో విడుదలవుతోంది.

https://www.youtube.com/watch?time_continue=94&v=OQmQXvTHVHE

Next Story
Share it