Telugu Gateway
Politics

కాపులను బీసీల్లో చేరుస్తామని..అగ్రవర్ణ రిజర్వేషన్లా?

కాపులను బీసీల్లో చేరుస్తామని..అగ్రవర్ణ రిజర్వేషన్లా?
X

గత ఎన్నికల ముందు తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పిందేమిటి?. కాపులను బీసీల్లో చేరుస్తానని. ఇది టీడీపీ ఎన్నికల హామీ కూడా. బీసీ కమిషన్ తో స్టడీ చేయిస్తున్నానని చెప్పి..కమిషన్ ఛైర్మన్ తో సంబంధం లేకుండా ‘ఉత్తుత్తి’ నివేదికతో అసెంబ్లీలో బిల్లు పెట్టి కేంద్రానికి పంపేసి చేతులు దులిపేసుకున్నారు. కానీ ఇప్పుడు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొత్త పల్లవి అందుకున్నారు. అదేంటి అంటే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తాజాగా అగ్రవర్ణ పేదలకు కల్పించిన పది శాతం రిజర్వేషన్లలో ఐదు శాతం కాపులకు ‘ప్రత్యేకం’గా కల్పిస్తారట. మరో సారి అసెంబ్లీలో బిల్లు పెడతారట. కేంద్ర చట్టాన్ని రాష్ట్ర అసెంబ్లీ మార్చగలదా?. అసలు ఇది సాధ్యం అవుతుందా?. ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పింది ఏమిటి?. ఇప్పుడు చేస్తున్నది ఏమిటి?. ఓ వైపు బీసీల్లో కలుపుతామని చెప్పి..ఇప్పుడు అగ్రవర్ణాల పేరుతో రిజర్వేషన్లు ఇస్తామనటం ఏమిటి?.

సహజంగానే ఈ రిజర్వేషన్లు మిగిలిన అగ్రవర్ణాల తరహాలోనే కాపులకు కూడా అందుతాయి. అయితే ఇందులో కొత్తగా చంద్రబాబు చేసేది ఏమిటి?. అసలు కేంద్రం చేసిన చట్టాన్ని మార్చటం సాధ్యం కాదని..కేవలం ఎన్నికల ముందు మరోసారి కాపులను మభ్యపెట్టేందుకే చంద్రబాబు ఈ ఎత్తుగడ వేశారని చెబుతున్నాయి అధికార వర్గాలు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లు ప్రవేశఫెడతామని చెబుతున్నారు. నిజంగా ఒక వేళ సాధ్యం అవుతుందే అనుకుందాం?. చంద్రబాబు తన ఎన్నికల అవసరాల కోసం మిగిలిన అగ్రవర్ణ పేదల హక్కులను హరిస్తారా?. ఇందుకు ఆయా కులాలు అంగీకరిస్తాయా?. మొత్తానికి ఎన్నికల ముందు ఈ అంశం మరోసారి రాజకీయ వివాదం రేపటం ఖాయంగా కన్పిస్తోంది.

Next Story
Share it