Telugu Gateway
Andhra Pradesh

బాలకృష్ణపై మ‌రో సారి నాగ‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాలకృష్ణపై మ‌రో సారి నాగ‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X

టాలీవుడ్ హీరో నంద‌మూరి బాలకృష్ణ పై నాగ‌బాబు మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్య‌ల‌పై నాగ‌బాబు వ‌ర‌స పెట్టి వీడియోలు విడుద‌ల చేస్తున్నారు. అయితే ఇంత కాలం మౌనంగా ఉండి ఆక‌స్మాత్తుగా ఈ అంశాల‌ను ఎందుకు తెర‌పైకి తెస్తున్నార‌నే అంశం ఆస‌క్తిక‌రంగా మారింది. తాజాగా విడుద‌ల చేసిన వీడియోలో నాగ‌బాబు మ‌రింత తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. మా బ్లడ్ వేరు.. మా బ్రీడ్ వేరు.. అన్నారు మీరు. ఏంటి మీరేమన్నా ఆకాశం నుంచి దిగివచ్చారా? లేకపోతే మీరేమయినా సూర్య వంశీకులా? మమ్మల్ని అవమానిస్తే మాకు కోపం రాదా? ఎవరైతే బాలకృష్ణను అన్నందుకు ఫీల్ అవుతున్నారో.. చెబుతున్నా.. ముందు అవతలి వ్యక్తి ఎన్ని కామెంట్లు చేశాడో తెలుసుకోండి’’ అని నాగబాబు అన్నారు.ఇత‌రుల‌ను తక్కువ చేసి మాట్లాడితే ఊరుకోమని చెప్పారు. తాము చాలా విషయాల్లో సైలెంట్‌గా ఉన్నాం.

ఎందుకంటే చిరంజీవి, పవన్ కళ్యాణ్‌కు కామెంట్లు చేయటం ఇష్టముండదు కాబట్టి.. ఇక చిరగా.. ‘‘మీరూ మాలాగే మనుషులు, మీరు కూడా ఒక తల్లిదండ్రులకే పుట్టారు.. మీరేమీ దైవాంశ సంభూతులు కాదు’’ అని వ్యాఖ్యానించారు. అమితాబ్ బచ్చన్ ఏం పీకాడు? అనే మాట మీరు మాట్లాడారు. స్వర్గీయ ఎన్టీఆర్ ఎంత పెద్ద స్టారో.. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా అంత పెద్ద స్టార్. కన్నడ రాజకుమార్, ఎంజీఆర్ కూడా అంత పెద్ద స్టార్లు. ఇంచుమించు మీ తండ్రి వయసున్న వ్యక్తులు వారు. అలాంటి వ్యక్తిని ఏం పీకారు అన్నపుడే చాలా భాదనిపించింది. సరే మాకెందుకులే అని ఊరుకున్నాం. ఆ తర్వాత చిరంజీవి ఏమయ్యాడు అన్నారు. మీ టాపిక్‌లో మా పేరు అవసరమా మీకు? అని ప్ర‌శ్నించారు.

Next Story
Share it