Telugu Gateway
Cinema

‘కలర్ ఫుల్’గా మజ్ను ట్రైలర్

‘కలర్ ఫుల్’గా మజ్ను ట్రైలర్
X

నువ్వు ఎంత ట్రై చేసినా నేను నీకు పడను. ఇది హీరోయిన్ డైలాగ్. ఓకే. థ్యాంక్యూ. ఇది హీరో సమాధానం. అదేంటి?. హీరోయిన్ ఆశ్చర్యం. ఇంకో అమ్మాయికి ట్రై చేసుకోవచ్చు కదా?. అంటూ షాకిచ్చిన వైనం. ఇలా సరదా సరదా డైలాగ్ లతో కలర్ ఫుల్ గా ఉంది ‘మజ్ను’ ట్రైలర్ లోని సన్నివేశాలు ఇది. ఎలాగైనా హిట్టు కొట్టాలనే పట్టుదలతో ఉన్న అక్కినేని అఖిల్ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. తొలిప్రేమ సినిమాతో హిట్‌ కొట్టిన వెంకీ అట్లూరితో కలిసి ‘మిస్టర్‌ మజ్ను’గా పలకరించేందుకు అఖిల్‌ సిద్దమయ్యాడు. ఈ సినిమా జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అందులో భాగంగా చిత్ర యూనిట్ సినిమా ట్రైలర్ విడుదల చేసింది. తాజాగా ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా వచ్చి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘ నా కోసం ఎవరైనా ఏడిస్తే అది నా తప్పు కాదు. కానీ.. నావల్ల ఒక్కరు ఏడ్చినా అది కచ్చితంగా నా తప్పు అవుతుంది’ , ‘ఇప్పుడు లవ్‌ అంటే.. ముందు కొంచెం లవ్‌చేసుకుని, ఆ తర్వాత ఇంకొంచెం ఎక్కువగా లవ్‌చేసుకుని.. లాస్ట్‌ లో పెళ్లి చేసుకుంటారు ఆ టైప్‌ లవ్వా.. నాకు అలా లవ్‌ చేయడం చేతకాదు’ అనే డైలాగ్‌లు ట్రైలర్ లో హైలెట్‌గా నిలిచాయి. ఈ సినిమాలో అఖిల్ జోడీగా నిధి అగర్వాల్ నటించింది.

https://www.youtube.com/watch?v=XSnFa0zqXRM

Next Story
Share it