వైసీపీలో చేరిన మేడా
BY Telugu Gateway31 Jan 2019 8:37 AM GMT

X
Telugu Gateway31 Jan 2019 8:37 AM GMT
తెలుగుదేశం పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి వైసీపీలో చేరారు. ఆయన గురువారం నాడు జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. గత వారమే మేడా మల్లికార్జునరెడ్డి తన అనుచరులతో వచ్చి జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. జగన్ తో భేటీ అయిన వెంటనే గత వారంలో టీడీపీ ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కడప జిల్లా రాజంపేట నుంచి వచ్చిన మేడా అనుచరులు కూడా ఆయనతో పాటు పార్టీలో చేరారు. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేశాకే వైసీపీలోకి చేరినట్లు ఆయన తెలిపారు.. వచ్చే ఎన్నికల్లో తానే ఎమ్మెల్యేగా పోటీచేస్తానని స్పష్టం చేశారు. తనకు సీటు ఇస్తున్నట్లు జగన్ స్పష్టం చేశారని తెలిపారు. అయితే నియోజకవర్గ ఇన్ ఛార్జి అమర్నాధ్ రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని..రాబోయే రోజుల్లో కలసి పనిచేస్తామని అన్నారు.
Next Story