టీడీపీకి షాక్..వైసీపీలోకి సిట్టింగ్ ఎమ్మెల్యే!
BY Telugu Gateway15 Jan 2019 1:36 PM GMT

X
Telugu Gateway15 Jan 2019 1:36 PM GMT
కడప జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీకి షాక్ తగలనుందా?. అంటే ఔననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయం హాట్ హాట్ మారుతోంది. ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నాలు జోరందుకున్నాయి. ప్రస్తుతం టీడీపీ రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలోకి చేరే అవకాశం ఉందని బలంగా ప్రచారం జరుగుతోంది.
ఆయన ఈ నెలాఖరులో వైసీపీలో చేరే అవకాశం ఉందని సమాచారం. విజయసాయి రెడ్డితో ఆయన మంతనాలు సాగించారు. మంతనాల అనంతరం పార్టీ మారాలని మేడా నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. పార్టీ మారేందుకు మేడా కుటుంబ సభ్యులు కూడా సుముఖంగానే ఉన్నారని చెబుతున్నారు. తనకు పార్టీలో ప్రాధాన్యం ఉండడం లేదని కొంత కాలంగా మేడా అసంతృప్తితో ఉన్నారు.
Next Story