ప్రతిపక్ష నేతగా భట్టి..స్పీకర్ ప్రకటన
BY Telugu Gateway20 Jan 2019 12:50 PM IST
X
Telugu Gateway20 Jan 2019 12:50 PM IST
శాసనసభలో ప్రతిపక్ష నేతగా భట్టి విక్రమార్కను గుర్తిస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా భట్టి విక్రమార్క పేరును రాహుల్ గాంధీ ఖరారు చేయటం..ఆ లేఖను పార్టీ నేతలు స్పీకర్ కు అందజేసిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా పోచారం శ్రీనివాసరెడ్డి ఆదివారం నాడు సభలో ప్రకటన చేశారు. భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష నేతగా భట్టి విక్రమార్క పేరును ప్రకటించిన తర్వాత సీఎం కెసీఆర్ ఆయనకు అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ శాసనసభలో ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించనుంది.
Next Story