Telugu Gateway
Cinema

‘మహర్షి’ హంగామా అబుదాబిలో!

‘మహర్షి’ హంగామా అబుదాబిలో!
X

సమ్మర్ లో సందడి చేసేందుకు మహేష్ బాబు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. అందులో భాగంగా ‘మహర్షి’ సినిమాను వేగంగా పూర్తి చేసుకుని...నెక్ట్స్ ప్రాజెక్టు సుకుమార్ దర్శకత్వంలో చేయటానికి రెడీ అయిపోతున్నాడు. కొన్ని సినిమాల పరాజయం తర్వాత మహేష్ బాబు మళ్ళీ ‘భరత్ అనే నేను’తో ట్రాక్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తెరకెక్కతున్న ఈ మహర్షి సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి కొన్ని కీలక సన్నివేశాల కోసం అబుదాబీ వెళ్లనున్నట్లు సమాచారం.

దీంతో పాటు మహేష్ బాబు అభిమానులకు మరో శుభవార్త. ఈ సినిమాకు సంబంధించినన టీజర్ ను చిత్ర యూనిట్ శివరాత్రికి విడుదల చేసే సన్నాహాల్లో ఉంది. పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ‘అల్లరి’ నరేశ్‌ కీలక పాత్ర చేస్తున్నారు. ‘దిల్‌’ రాజు, అశ్వనీదత్, పీవీపీ లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Next Story
Share it