Telugu Gateway

నేనా రాజకీయాల్లోకా...నో!

నేనా రాజకీయాల్లోకా...నో!
X

బాలీవుడ్ భామ కరీనా కపూర్ క్లారిటీ ఇఛ్చేశారు. తాజాగా ఆమె రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారని..కాంగ్రెస్ టిక్కెట్ పై ఎంపీగా పోటీచేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి ఆమె బ్రేక్ వేశారు. ప్రస్తుతానికి తనకు రాజకీయాల్లోకి ప్రవేశించే ఆలోచన లేదని..తన ఫోకస్ అంతా సినిమాలే అంటూ తేల్చిచెప్పేశారు. అయితే రాజకీయాల్లోకి రావాలని తనను ఇంతవరకు ఏ పార్టీ సంప్రదించలేదని తెలిపారు.

ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. కరీనా హీరోయిన్‌గా నటించిన ‘గుడ్‌న్యూస్‌’ సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో భోపాల్‌ నుంచి కరీనాను బరిలో దించేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నిస్తున్నట్టుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Next Story
Share it