చంద్రబాబు ప్రతిపాదనకు పవన్ నో

కలసి పనిచేద్దామన్న ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడి ప్రతిపాదనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నో చెప్పారు. ఈ మేరకు జనసేన ట్విట్టర్ వేదికగా అధికారికంగా స్పందించింది. ‘జనసేన పార్టీ 175 స్థానాల్లో సంపూర్ణంగా పోటీచేస్తున్నాం. వామపక్షాలు తప్ప ఎవరితో కలసి వెళ్లం. యువతకు, మహిళలకు ఎక్కువ అవకాశం ఇస్తాం. దయచేసి అధికార పక్షం, ప్రతిపక్షాల మాటలు నమ్మోద్దు. ముక్తకంఠంతో ఖండించండి’ అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. దీంతో టీడీపీ, జనసేనల కలయిక ప్రచారానికి బ్రేక్ పడినట్లు అయింది. ఏది ఏమైనా ఏపీ అసెంబ్లీ ఎన్నికలు మాత్రం ఈ సారి హాట్ హాట్ గా ఉండటం ఖాయంగా కన్పిస్తోంది.
ఎలాగైనా తిరిగి అధికారం నిలబెట్టుకోవాలని టీడీపీ సర్వశక్తులు ఒడ్డుతుంటే..ఎలాగైనా ఈ సారి అధికార పీఠం దక్కించుకోవాలని ప్రధాన ప్రతిపక్షం వైసీపీ సన్నాహాలు చేసుకుంటోంది. జనసేన కూడా ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటాలనే ప్రయత్నాల్లో ఉంది. మరి ఎవరి ప్రయత్నాలు ఫలిస్తాయో వేచిచూడాల్సిందే. ఎన్నికలు జరిగేందుకు ఇంకా మూడు, నాలుగు నెలల సమయం ఉన్నందున ఈ లోపు ఎన్ని పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచిచూడాల్సిందే.