Telugu Gateway
Politics

మళ్ళీ మొదటికొచ్చిన జగన్ కేసులు

మళ్ళీ మొదటికొచ్చిన జగన్ కేసులు
X

జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి కీలక పరిణామం. ఈ కేసులు మళ్ళీ మొదటికొచ్చాయి. ఇంత కాలంగా జగన్ కేసులు విచారిస్తున్న సీబీఐ న్యాయవాది ఏపీకీ బదిలీ కావటంతో మళ్ళీ ఈ కేసును మొదటి నుంచి వినాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇదే జరిగితే ఈ కేసుల మరికొంత కాలం సాగే అవకాశం కన్పిస్తోంది. ఈ కేసుల విచారణలో భాగంగా శుక్రవారం నాడు జగన్మోహన్ రెడ్డి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. తదుపరి విచారణ ఈ నెల 25కి వాయిదా పడింది. జగన్ పై నమోదు అయిన 11 కేసులకు సంబంధించి కోర్టులో విచారణ సాగుతున్న విషయం తెలిసిందే. జగన్ తోపాటు విజయసాయిరెడ్డి కూడా ఈ కేసుల్లో కీలక నిందితుడుగా ఉన్నారు.

అయితే తమకు ఈ కేసులతో ఎలాంటి సంబంధం లేదని..తమను వీటి నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ జగన్ తో పాటు విజయసాయిరెడ్డి పిటీషన్లు దాఖలు చేశారు. మొత్తం 11 ఛార్జిషీట్లకు గాను ఇఫ్పటికే 4 కేసుల్లో వాదనలు దాదాపు పూర్తయ్యాయి. ఈ తరుణంలో సీబీఐ న్యాయమూర్తి వెంకట రమణ ఏపీకి బదిలీ అయ్యారు. అన్ని కేసుల్లో తీర్పు ఒకేసారి ఇవ్వాలనే యోచనలో సీబీఐ కోర్టు వాదనలు విన్న వాటిపై కూడా తీర్పు వెలువరించలేదని చెబుతున్నారు. అయితే ఈ వ్యవహారం మళ్ళీ మొదటికి రావటంతో ఇది ఇంకెంత కాలం సాగుతుందో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Next Story
Share it