Telugu Gateway
Cinema

రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’ షురూ

రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’ షురూ
X

రామ్ పూర్తి మాస్ మసాలా హీరోగా మారిపోతున్నట్లు కన్పిస్తోంది. ఆ లుక్స్ చూస్తుంటే అలాగే కన్పిస్తున్నాయి. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా షూటింగ్ బుధవారం నాడు ప్రారంభం అయింది. రామ్ తాజాగా ‘హలో గురూ ప్రేమ కోసమే’ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. అయితే ఇస్మార్ట్ శంకర్ లో రామ్ కు జోడీగా నటించే భామ ఎవరో ఇంకా తేలాల్సి ఉంది.

పూరి జగన్నాథ్‌ ఆఫీస్‌లో సినిమా షూటింగ్ లాంచనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పూరి జగన్నాథ్‌, హీరో రామ్‌తో పాటు సహ నిర్మాత చార్మి కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి స్రవంతి రవికిశోర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. గురువారం నుంచి ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించనున్నారు.

Next Story
Share it