Telugu Gateway
Cinema

‘ఎఫ్ 2’పై మహేష్ బాబు ప్రశంసలు

‘ఎఫ్ 2’పై మహేష్ బాబు ప్రశంసలు
X

సంక్రాంతి రేస్ లో బరిలో నిలిచిన ఎఫ్ 2 సినిమా దుమ్మురేపుతోంది. అన్ని సినిమాల కంటే పూర్తి స్థాయి ఎంటర్ టైన్ మెంట్ సినిమా కావటంతో ప్రేక్షకులు అందరూ కూడా ఈ సినిమా వైపే క్యూ కడుతున్నారు. సినిమా స్టార్లు కూడా ఎఫ్ 2పై ప్రశంసలు కురిపిస్తున్నారు. హీరో మహేష్ బాబు ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

ఈ సినిమాను చాలా ఎంజాయ్ చేశానని..వెంకీ టైమింగ్ ఫన్నీగా ఉందని తెలిపారు. వెంకటేష్, వరుణ్ తేజ్ ల కాంబినేషన్ సరిగ్గా సరిపోయిందని అన్నారు. పూర్తి వినోదాత్మకంగా ఉన్న ఈ సినిమాను ఫుల్ గా ఎంజాయ్ చేసినట్లు వెల్లడించారు. మహేస్ బాబు ప్రస్తుతం ‘మహర్షి’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Next Story
Share it