Telugu Gateway
Politics

జగన్ పై దాడి కేసు..ఎన్ఐఏ విచారణపై స్టేకు హైకోర్టు నో

జగన్ పై దాడి కేసు..ఎన్ఐఏ విచారణపై స్టేకు హైకోర్టు నో
X

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన దాడి కేసులో జాతీయ పరిశోధనా సంస్థ (ఎన్ఏఐ) విచారణపై స్టే ఇవ్వటానికి హైకోర్టు నిరాకరించింది. గత శనివారం నాడే అత్యవసరంగా ఈ కేసును విచారించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం పిటీషన్ దాఖలు చేసింది. అయితే అత్యవసరంగా ఈ కేసును విచారించాల్సిన అవసరం లేదని..సోమవారం వింటామని హైకోర్టు తెలిపింది. అన్నట్లుగానే ఈ సోమవారం కేసును విచారించిన హైకోర్టు ఇరుపక్షాల వాదనలు విన్నది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లు ఎన్ఐఏ విచారణ పై స్టే ఇవ్వటానికి కోర్టు నిరాకరించింది.

అయితే జనవరి 30లోగా ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. అయితే ఎన్ఐఏ అంశం కేంద్ర, రాష్ట్రాల పరిధికి సంబంధించింది అయినందున హైకోర్టుకు అసలు ఈ కేసును వినకూడదని..సుప్రీంకోర్టు మాత్రమే ఈ కేసులో వాదనలు వినాలని జగన్ తరపు లాయర్లు వాదించారు. కేంద్రం కౌంటర్ దాఖలు చేసిన తర్వాత మరోసారి దీనిపై వాదనలు జరగనున్నాయి. ఎన్ఐఏ విచారణకు సంబంధించిన అంశాలను కూడా కోర్టు ముందు ఉంచాలని హైకోర్టు ఆదేశించింది.

Next Story
Share it