Telugu Gateway
Offbeat

ప్రపంచంలోని అత్యంత రద్దీ విమానాశ్రయం దుబాయ్

ప్రపంచంలోని అత్యంత రద్దీ విమానాశ్రయం దుబాయ్
X

దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యధిక రద్దీ విమానాశ్రయంగా గుర్తింపు పొందింది. వరసగా ఐదవ సారి ఈ రికార్డును సొంతం చేసుకుంది. 2018 సంవత్సరానికి అత్యంత ఎక్కువ మంది ప్రయాణికులు ఈ విమానాశ్రయం ద్వారానే రాకపోకలు సాగించారు. 2018లో ఈ విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికుల సంఖ్య 8.9 కోట్లకు చేరింది. విశేషం ఏమిటంటే ఈ విమానాశ్రయానికి చేరుకునే వారిలో అత్యధిక శాతం భారత్ నుంచే ఉంటారు. గత ఏడాది దుబాయ్ కు భారత్ నుంచి దుబాయ్ కు 1.2 కోట్ల మంది వెళ్ళారు.

వాస్తవానికి గత ఏడాది ఈ విమానాశ్రయం ద్వారా 90.3 మిలియన్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారని అంచనా వేయగా..ఈ అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. భారత్ నుంచి దుబాయ్ కు ఎక్కువ మంది ముంబయ్, ఢిల్లీ, కొచ్చిన్ విమానాశ్రయాల నుంచే వెళుతున్నారు. 2014 వరకూ ప్రపంచంలో అత్యంత రద్దీ విమానాశ్రయంగా లండన్ లోని హీత్రూ విమానాశ్రయం ఉండేది. కానీ గత ఐదేళ్ల నుంచి ఈ ఘనతను దుబాయ్ ఎయిర్ పోర్టు సొంతం చేసుకుంది. 1937 జులైలో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం అయింది.

Next Story
Share it