ఆపరేషన్ థియేటర్ లో నర్సుకు ముద్దు
BY Telugu Gateway14 Jan 2019 11:50 AM IST

X
Telugu Gateway14 Jan 2019 11:50 AM IST
ఎవరైనా ఆపరేషన్ థియేటర్ లో ఆపరేషన్లు చేస్తారు. కానీ ఆ డాక్టర్ మాత్రం వెరైటీ పనిచేశాడు. తనతోపాటు ఉన్న నర్సుకు ఆ డాక్టర్ ముద్దు పెట్టాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలోకి వచ్చి హల్ చల్ చేసింది. అంతే సదరు డాక్టర్ పై వేటు పడింది. అంతే కాదు..ఈ ఘటనపై సర్కారు విచారణకు ఆదేశించింది. అయితే ఇది ఎక్కడ జరిగింది అంటారా?. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు చేసిన నిర్వాకం ఇది.
సివిల్ సర్జన్‌గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి.. అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న మహిళ నర్సును ఆపరేషన్ థియేటర్లోనే ముద్దుపెట్టుకున్నాడు. విషయం కలెక్టర్ శశాంక్ మిశ్రా దాకా వెళ్లడంతో.. ఆయన వెంటనే స్పందించారు. ఆ వైద్యుని విధుల నుంచి తొలగించడంతోపాటు, ఈ ఘటనపై వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులు జారీ చేశారు.
Next Story



