Telugu Gateway
Politics

దగ్గుబాటి అవకాశవాదంతో ఎన్టీఆర్ కు అప్రతిష్ట

దగ్గుబాటి అవకాశవాదంతో ఎన్టీఆర్ కు అప్రతిష్ట
X

ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా?. సాక్ష్యాత్తూ టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. లక్ష్మీపార్వతి, దగ్గుబాటి వెంకటేశ్వరరావులు అవకాశవాదంతో ఎన్టీఆర్ ను వాడుకున్నారని ఆయన ఆరోపించారు. అధికారం కోసమే దగ్గుబాటి ఇప్పుడు వైసీపీలో చేరుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. దగ్గుబాటి మారని పార్టీలేదని విమర్శించారు. సోమవారం నాడు పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ‘అధికారం కోసమే దగ్గుబాటి కుటుంబం వైసిపిలో చేరిక. దగ్గుబాటి మారని పార్టీలు లేవు. ఆర్ ఎస్ ఎస్ మొదలు అన్నిపార్టీల చుట్టూ ప్రదక్షిణలు. బిజెపి-కాంగ్రెస్-బిజెపి-ఇప్పుడు వైసిపి. కాంగ్రెస్ లో ఆమె కేంద్రమంత్రి, ఈయన ఎమ్మెల్యే. తరువాత కాంగ్రెస్ ను వదిలేసి బీజేపిలోకి. ఇప్పుడు మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్. అధికారం కోసమే వీళ్ల ఫిరాయింపులన్నీ. అధికారం కోసమే లక్ష్మీపార్వతి వైసిపితో కుమ్మక్కు. అవకాశవాదంతోనే ఆనాడు ఎన్టీఆర్ ను వాడుకున్నారు. వీళ్ల అవకాశవాదంతో ఎన్టీఆర్ కు అప్రదిష్ట. అవకాశ వాదులంతా వైసిపి గూటికి చేరారు.

టిఆర్ ఎస్ తో జగన్ కలయిక బిసి వ్యతిరేకం. ఆ 29కులాల్లో వైసిపి పై తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రజలను మభ్యపెట్టాలనేదే జగన్ అజెండా. దీనిపై బీసిలను చైతన్యపరచాలి. అభివృద్ధిపై జగన్ కు ఒక అజెండా అనేదే లేదు. కుట్రలు,కుతంత్రాలే వైఎస్సార్ కాంగ్రెస్ అజెండావాళ్ల డొల్లతనాన్ని ప్రజల్లో ఎండగట్టాలి. ఆదివారం మదురైలో జరిగిన సంఘటనలు ప్రధానిపై ‘‘మూడ్ ఆఫ్ ది నేషన్’’ కు నిదర్శనం. నల్లజెండాలు,నల్ల బెలూన్లతో తమిళుల నిరసనలు. గజ తుపాన్ పై మోది నిర్లక్ష్యానికి మదురైలో నిరసనలు. తమిళనాడుతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ కు తీరని ద్రోహంమోది, షా లు ఏపికి వస్తే ఇంతకన్నా తీవ్ర వ్యతిరేకత, నిరసనలు. బిజేపికి వ్యతిరేకంగా 11 ధర్మపోరాట సభలు జరిపాం. టిడిపి ఎంపీలు ఢిల్లీలో రాజీలేని పోరాటం.దేశంలో బిజెపి ఓటమే లక్ష్యంగా పనిచేయాలి. రాష్ట్రంలో వైసిపి కుట్రలను భగ్నం చేయాలి.అమరావతిలో ధర్మపోరాటం చివరి సభ. జాతీయ పార్టీల నేతలంతా వస్తారు. కోల్ కత్తా ర్యాలీకి ధీటుగా అమరావతి సభ. టిడిపి కార్యకర్తలు,నేతలు కలిసికట్టుగా పనిచేయాలి. దేశాన్ని కాపాడుకోవాలి. రాష్ట్రం హక్కుల కోసం పోరాడాలి.’ అని వ్యాఖ్యానించారు.

Next Story
Share it