‘క్యాథరిన్’ సందడి
క్యాథరిన్. యూత్ మతిపోగొట్టించే భామ. టాలీవుడ్ లో ఆమెకు ప్రత్యేక స్థానం ఉంది. పలు సినిమాల్లో ఆమె తన సత్తా చాటారు. కానీ ఈ మధ్య కాలంలో క్యాథరిన్ సినిమాలు పెద్దగా ఏమీ విడుదల కాలేదు. కాకపోతే ఈ కొరత కొత్త ఏడాది తీరిపోనుంది. ఎందుకంటే ఈ భామ ఏకంగా ఐదు సినిమాల్లో సందడి చేయనుందట. మరి ఇది సహజంగా క్యాథరిన్ అభిమానులకు పండగే కదా?. తెలుగులో సంతోష్ శివన్, రవితేజ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాలో హీరోయిన్‌గా సెలెక్ట్ అయ్యారు.
దీంతోపాటు విజయ్ దేవరకొండ సినిమాలోనూ చాన్స్ కొట్టేశారని టాక్. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రాశీఖన్నా, తమిళ భామ ఐశ్వర్యా రాజేశ్, బ్రెజిల్ మోడల్ ఇసబెల్లా హీరోయిన్స్‌గా కనిపించనున్నారు. ఇందులో మరో హీరోయిన్‌గా క్యాథరీన్ కూడా ఎంపికైనట్టు టాలీవుడ్ టాక్. తమిళంలోనూ క్యాథరిన్ సందడి చేయనున్నారు.