ఇండియాలో ఎక్కడా లేని ఆ కోర్సు హైదరాబాద్ ఐఐటిలో
BY Telugu Gateway20 Jan 2019 11:46 AM IST
X
Telugu Gateway20 Jan 2019 11:46 AM IST
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ). శరవేగంగా దూసుకెళుతున్న రంగం. దేశంలోనే తొలిసారి హైదరాబాద్ లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) లో ఏఐకి సంబంధించి పూర్తి స్థాయి బీటెక్ కోర్సు ప్రారంభం కానుంది. 2019-20 విద్యా సంవత్సరం నుంచే ఈ కోర్సు ప్రారంభం కానుంది. దేశంలోనే ఈ కోర్సు ప్రారంభిస్తున్న విద్యా సంస్థ హైదరాబాద్ ఐఐటి.
ఇప్పటివరకూ ప్రపంచంలో ఏఐపై కోర్సులు అందిస్తున్న యూనివర్శిటీలు కార్నిగి మెలాన్ యూనివర్శిటీ, మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ లు మాత్రమే. ఇప్పడు వాటి సరసన హైదరాబాద్ ఐఐటి చేరింది. జెఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ద్వారా విద్యార్ధులు ఈ కోర్సులో చేరటానికి అవసరం ఉంటుంది. మనుషుల అవసరాన్ని పరిమితం చేసి కంప్యూటర్లే తమంత తాము పనిచేయటాన్నే ఏఐ అంటారు.
Next Story